Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Andhra Pradesh :  ఆర్టీసీని  ప్రయివేటీకరించం - మంత్రి మండిపల్లి

Andhra Pradesh : ఆర్టీసీని ప్రయివేటీకరించం - మంత్రి మండిపల్లి

TeluguPost.com 1 week ago

ర్టీసీ ఆధునీకరణకు తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆర్టీసీని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందన్నారు.

స్త్రీ శక్తి పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందని, రాష్ట్రంలో దశలవారీగా ఈవీ బస్సుల విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. తొలి దశలో 700 ఈవీ బస్సులు రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయని, జూలైలో 6 డిపోలలో ఈవీ బస్సుల నిర్వహణకు మౌలిక సదుపాయాలు సిద్ధం చేసినట్లు మంత్రి మండిపల్లి తెలిపారు.

గోదావరి పుష్కరాలకు...మహావాస్ పథకం కింద 300 ఈవీ బస్సుల కేటాయించినట్లు తెలిపారు. మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఈవీ బస్సుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని, కాలుష్య నియంత్రణలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలకు "గోదావరి" అనే పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని, అన్ని ఘాట్ల వద్ద పుష్కరాల ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు అన్ని విభాగాల్లో ఈవీ బస్సుల వినియోగించనున్నామని, స్త్రీ శక్తి పథకం ఆర్టీసీపై భారం కాదని, బాధ్యత అని, ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు మధ్య విడదీయరని అనుబంధం ఉందని, పీపీపీ విధానంలో డిపోల ఆధునీకరణ చేపడతాం=మని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu