Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Andhra Pradesh : బుద్ధ ప్రసాద్ కు రాజకీయ వైరాగ్యం.. అందుకేనా?

Andhra Pradesh : బుద్ధ ప్రసాద్ కు రాజకీయ వైరాగ్యం.. అందుకేనా?

TeluguPost.com 1 week ago

Janasena : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కు రాజకీయ వైరాగ్యం వచ్చింది. ఆయన గత ఎన్నికల్లో తాను పోటీ చేసి తప్పు చేశానని బాధపడుతున్నారు. నిజానికి తాను గెలిచి తప్పు చేశానని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అనడం ఏపీ రాజకీయాలకు అద్దం పడుతుంది.

నిజానికి మండలి బుద్ధ ప్రసాద్ సౌమ్యుడు. ఆయన ఎవరినీ నొప్పించరు. ఒకరిని మాట తూలే వ్యక్తి కాదు. నాయకుల్లో విభిన్నమైన నేతగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు పేరుంది. ఆయన తండ్రి మండలి వెంకట కృష్ణారావు నుంచి నేర్చుకున్న రాజకీయ పాఠాలు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను రాజకీయంగా ఇంత వరకూ తీసుకు వచ్చాయి.

తెలుగు భాషను కాపాడుకోవడం కోసం...తెలుగు భాషను కాపాడుకోవడం కోసం దశాబ్ద కాలం నుంచి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలోఆయనకు మంచి పేరుంది. అవినీతి, ఆరోపణలకు దూరంగా ఉంటారు. ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకూ చిన్న మచ్చ లేదు. కాకుంటే ఒకటే. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అనేక పార్టీలుమారారు. కాంగ్రెస్ లోఉన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తర్వాత టీడీపీలోచేరారు. 2014 లోటీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. అయితే గత ఎన్నికలకు ముందు ఆయనకు టిక్కెట్ ఇబ్బందికరం కావడంతో జనసేనలోకి మారారు. ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అవనిగడ్డ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు. అదే ఆయన వేదన...బహుశ అదే ఆయనను బాధించి ఉండవచ్చంటున్నారు. తనకన్నా రాజకీయంగా తక్కువ అనుభవం ఉన్న నేతలతో పాటు వయసు కూడా తక్కువ ఉన్న వారు తనను విమర్శించడం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా వ్యక్తిగత విమర్శలకు వేదికగా మారడం ఆయనను మరింత బాధించినట్లుంది. అందుకే ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తాను రాజకీయాల్లో ఎందుకున్నానో అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమే పెద్ద తప్పు చేశానని మండలి బుద్ధప్రసాద్ అన్నారంటే ఎంత వేదన చెందారో అర్థం చేసుకోవచ్చు. దిగజారిన రాజకీయ విలువలను చూసి రోజూ బాధపడుతున్నానని మండలి బుద్ధప్రసాద్ అన్నారంటే అందుకు గల కారణాలు నేటి తరం రాజకీయ నేతలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu