ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యులపై సీరియస్ యాక్షన్ కు దిగింది. యాభై ఒక్క మంది వైద్యులను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
బోధనాసుపత్రుల్లో వైద్యులుగా ఉంటూ అనధికార సెలవులపై ఉన్న యాభై ఒక్క మంది వైద్యులపై చర్చలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిస్మిస్ అయిన వైద్యుల్లో నలభై ఒక్క మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాగా, ఇద్దరు ట్యూటర్లు, ఎనిమిది అసోసియేట్ వైద్యులు ఉన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా...
వీరితో పాటు మరో 33 మందికి వైద్య ఆరోగ్య శాఖ ఛార్జి మెమోలు జారీ చేశారు. మరోముగ్గురు ప్రొఫెసర్లపైనా చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రజారోగ్యం పట్ల బాద్యతారహిత్యంగా వ్యవహరించే వైద్యులను ఇక విధుల్లో ఉంచబోమని సత్యకుమార్ యాదవ్ చప్పారు. ఏడాది నుంచి విధులకు దూరంగా ఉంటున్న వారిని రాజీనామా చేసినట్లుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

