ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీలో కొత్త మార్పులు తీసుకు వచ్చింది. ఇకపై రేషన్ సరుకుల కోసం సీబీడీసీ డిజిటల్ రూపాయి విధానం అమలు చేయనుంది.
ప్రయోగాత్మకంగా విజయవాడ, విశాఖపట్నంలో ఈ విధానం ప్రారంభం కానుంది.
డిజిటల్ వాలెట్ తో...ఈ విధానంలో ప్రతి కుటుంబానికి డిజిటల్ వాలెట్ ఇస్తారు. బయోమెట్రిక్ అవసరం లేదు. సబ్సిడీ డైరెక్ట్‌గా డిజిటల్ రూపాయిగా జమ అవుతుంది. రేషన్ షాపుల్లో ఈ-పేమెంట్స్ జరపుతారు. వేగవంతమైన లావాదేవీల కోసం ఈ విధానం తీసుకు వచ్చారు. మధ్యాహ్న భోజన పథకానికి స్టీమ్ బియ్యం కూడా అందించనున్నారు.

