Visakha : సముద్రంలో విశాఖకు చెందిన గల్లంతయిన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 1వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు జాలర్లు కనిపించకుండా పోయారు.
వారిలో ఒకరు సురక్షితంగా బయటకు వచ్చారు.
ఆరుగురి ఆచూకీ కోసం...
మత్స్యకారుల ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ అవడంతో గల్లంతయ్యారని మెరైన్ పోలీసులకు వారి బంధువులు సమాచారం అందించారు. దీంతో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఇప్పటి వరకూ మత్స్యకారుల జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.

