Vijayanagaram : ఒడిశా తీరంలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకారులను స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.
ఇంజిన్ లో సాంకేతిక లోపంతో మత్స్యకారుల బోటు సముద్రంలో నిలిచిపోయింది. దీంతో మత్స్యకారులు తమను రక్షించాలని వీడియో పంపారు.
ఊపిరిపీల్చుకున్న...పరిస్థితిని వివరిస్తూ మత్స్యకారుల వీడియోపై అధికారులు వెంటనే అప్రమత్తమై వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారన్న మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే వారిని సొంత గ్రామాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీంతో మత్స్యకారుల కుటుంబాలు ఊపిరిపీల్చుకున్నాయి.

