Railway Koduru : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్ర పవన్ కల్యాణ్ లు నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇరువురు నేతలు శ్రీకారం చుట్టనున్నారు.
ఈకార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
వీబీజీరామ్‌జీ పథకాన్ని...ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లిలో వీబీజీరామ్‌జీ పథకాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి చౌహాన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ లు ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి భారీగా జనసమీకరణ చేయనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

