Vijayanagaram : విజయనగరం జిల్లాకు చెందిన మరొక మత్స్యకారుల బోటు ఒడిశా తీరంలో చిక్కుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు చిక్కుకుంటున్నాయి.
విశాఖ హార్బర్ నుంచి సముద్రంలోకి చేపలవేటకు వెళ్లిన బోటు గల్లంతు అయిన సంగతి తెలిసిందే.
మరొక బోటులో మత్స్యకారులు...తాజాగా మరొక బోటు కూడా సముద్ర తీరంలో చిక్కుకుంది. ఇంజిన్‌లో సాంకేతికలోపంతో 6 రోజులుగా సముద్రంలోనే మత్స్యకారులు ఉన్నారని చెబుతుున్నారు. సముద్రంలో చిక్కుకున్నామని, రక్షించాలంటూ కొన్ని వీడియోలను పంపుతున్న మత్స్యకారులను తిరిగి ఒడ్డున చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

