Andhra Pradesh : ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. శాసనసభ వర్షాకాల సమావేశాలను నిర్వహించడం పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సభ నిర్వహణ విషయంలో ప్రభుత్వం నిర్ణయం రేపు ప్రకటించే అవకాశం ఉది.
రేపటి మంత్రివర్గ సమావేశంలో...రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రేపటి కేబినెట్ భేటీలో చర్చించినిర్ణయం తీసుకుంటారు. కీలక మైన బిల్లులను ఆమోదం పొందేందుకు, వివిధ అంశాలపై చర్చించేందుకు సభ నిర్వహణ ఎన్ని రోజులనే దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

