కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు హైకోర్టులో విచారణ వాయిదా పడింది. భగీరథ్ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణను వాయిదా వేసింది. తనపై నమోదయిన పోక్సో కేసును కొట్టివేయాలని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అయితే మధ్యంతరబెయిల్ పై తీర్పును రేపు వెల్లడిస్తామని హైకోర్టు వెల్లడించింది. ముందస్తు బెయిల్ పై వచ్చే వారం విచారిస్తామని పేర్కొంది.
జనన సర్టిఫికెట్ ను...నిందితుడి తరుపున న్యాయవాది నిరంజన్ రెడ్డి బాధితురాలి వయసుపై పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళలారు. పోలీస్ ఛార్జిషీట్ల్ లో వయసు పదిహేనేళ్లు ఉందని, జీహెచ్ఎంసీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం 2008లో ఉందని, పాన్ కార్డులో 2010 అని ఉందని చెప్పారు. జనన ధృవీకరణ పత్రాలను పరిశీలించాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. కేసు విచారణ వాయిదా వేసింది.

