బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్తగా మరో సెక్షన్‌ను పోలీసులు జోడించారు. ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు మరికొన్ని సెక్షన్లు చేర్చారుక.
ఆ మేరకు భగీరథ్‌పై బీఎన్ఎస్ 64(2)(m) సెక్షన్‌ను పోలీసులు చేర్చారు. ఈ నేరం రుజువైతే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే భగీరథ్‌పై BNS 74, 75, Pocso సెక్షన్ 5(1) r/w 6 సెక్షన్లు నమోదయ్యాయి.
నేడు పోలీస్ కస్టడీకి...
మరొకవైపు నేడు బండి భగీరథ్‌ను పోలీసులు కస్టడీకి కోరనున్నారు. మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగా బండి భగీరథ్ ను విచారణ చేయాలని నిర్ణయించారు. భగీరథ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం బండి భగీరథ్ పోక్సో కేసు నమోదయి చర్లపల్ల జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

