బండి భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పోక్సో కేసు నమోదు కావడంతో బండి భగీరథ్ కోసం నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీల్లో భగీరధ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విదేశాలకు పారిపోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నోటీసులు జారీ చేశారు.
నాలుగు బృందాలుగా...బండి భగీరథ్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన విదేశాలకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరొకవైపు సిట్ కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు బండి భగీరథ్ రాకపోవడంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

