అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ భారత్ లో పర్యటిస్తున్నారు. భారత్ పర్యటనకు వచ్చిన టిఫానీ ట్రంప్ దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
టిఫానీ ట్రంప్ వ్యక్తిగత పర్యటనల కోసమే భారత్ లో పర్యటిస్తున్నారని వైట్ హౌస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
నేడు తాజ్ మహల్ కు...
టిఫానీ ట్రంప్ భారత్ లో పర్యటిస్తుండటంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె శుక్రవారం ఢిల్లీలోని అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఈరోజు టిఫానీ ట్రంప్ తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. టిఫానీ ట్రంప్ భారత్ లో పర్యటిస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

