నరేంద్ర మోదీ త్వరలో ప్రధానిగా పన్నెండేళ్ల పాలనను పూర్తి చేసుకోనున్నారు. అత్యంత ఎక్కువ సమయం ప్రధానిగా భారత్ ను పాలించిన మోదీగా రికార్డులను బ్రేక్ చేయనున్నారు.
దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ సంబరాలను చేయాలని నిర్ణయించింది. మోదీ పన్నెండేళ్ల పాలన సందర్భంగా బీజేపీ భారీ వేడుకలు నిర్వహించనుంది.
జూన్ 5వ తేదీ నుంచి 21వరకూ...జూన్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాు. విశ్వాసం-వికాసం-జన సంక్షేమం పేరిట ప్రచార యాత్రలు జరపనున్నారు. యోగా, మొక్కలు నాటడం, స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల పర్యటించాలని కేంద్ర పార్టీ నాయకత్వం ఆదేశించింది. స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యంఇవ్వాలని బీజేపీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.

