Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Botsa : విజయనగరం కోటపై "బొత్స" జెండా.. అజెండా అదేనా?

Botsa : విజయనగరం కోటపై "బొత్స" జెండా.. అజెండా అదేనా?

TeluguPost.com 8 hrs ago

Andhra Pradesh : సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కు సానుభూతి పెరుగుతుందా? అంటే అవుననే అంటున్నారు. విజయనగరం జిల్లాలో గత మూడు దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వచ్చిన బొత్స కుటుంబంలో చెలరేగిన అలజడి ఆయనకు మరింత అనుకూలిస్తా యని భావిస్తున్నారు.

బొత్స సత్యనారాయణ స్వభావం, అందరిలో కలుపుకుని వెళ్లే తత్వం, నికార్సయిన రాజకీయాలు చేయడం వంటివి ఆయనకు కలసి వచ్చే అంశాలని అంటున్నారు. వందల సంవత్సరాల నుంచి విజయనగరం జిల్లా విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, కురుపాం రాజులు, మొయిద రాజులు ఏక చక్రాధిపతిగా పరిపాలించిన చరిత్ర విజయనగరం జిల్లాది. ఆలాంటి విజయనగరం జిల్లా పై బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం సాధారణ కుటుంబం నుండి వచ్చి బొత్స సత్యనారాయణ 1991 నుండి రాజకీయాల్లో జిల్లాకు చెందిన వివిధ సంస్థానాల రాజులు ప్రాబల్యాన్ని తగ్గించుకొని రాజకీయంగా మెట్టు మెట్టు ఎదుగుతూ 2004 వచ్చేసరికి రాష్ట్ర మంత్రి అయినప్పటి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. బొత్స సత్యనారాయణ జిల్లాకుచెందిన వారు ఏ పార్టీలో ఉన్న ప్రజలను గాని ఎలాంటి సహాయ సహకారాలు కావాలనుకున్న పార్టీలతో సంబంధం లేకుండా ఇంటికి వెళ్ళగానే ఏం పని మీద వచ్చారు ఏం కావాలి ఎవరికి చెప్పాలి అనేప్రశ్నలతో ఆ కుటుంబం మమైకం పనిచేస్తుందని అంటారు.

తీవ్ర చర్చనీయాంశమైనా...

వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబంలో మరియు విజయనగరం రాజకీయాల్లో జరుగుతున్న తాజా పరిణామాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన మేనల్లుడు మరియు వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు అయిన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరడం రాజకీయంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ పరిణామం నేపథ్యంలో బొత్స సత్యనారాయణపై ప్రజల్లో లేదా రాజకీయ వర్గాల్లో సానుభూతిభూతి పెరుగుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది. సొంత కుటుంబ సభ్యుడే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో బొత్స ఒంటరయ్యారనే భావన కొంతవరకు సానుభూతిని కలిగించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా...

మరోవైపు, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరియు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో 'బొత్స కుటుంబం' అంటే ఒక బలమైన శక్తీగా ఉండేది. అయితే, ఇప్పుడు కుటుంబంలోనే చీలిక రావడం, అత్యంత నమ్మకస్తుడైన మేనల్లుడే పార్టీ మారడం వల్ల బొత్స పట్టు సడలిందనే వాదన రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా బొత్స కుటుంబమే జిల్లాలో పెత్తనం చేస్తుందన్న వాదన కూడా వినపడుతుంది. అయితే ఈ పరిణామాలపై బొత్స అత్యంత చాకచక్యంగా స్పందించారు. "రాజకీయాల్లో మనుషులకు స్వార్థం ఉంటుంది, వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు.. కానీ పార్టీలు మాత్రమే ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తాయి" అంటూ చిన్న శ్రీను చేరికను పెద్దగా పట్టించుకోనట్లు వ్యాఖ్యానించారు. సొంత మేనల్లుడే పార్టీ వీడి వెళ్లడం బొత్సకు వ్యక్తిగతంగా కొంత ఇబ్బందికరమైన విషయమే అయినా, దీనివల్ల ఆయనకు రాజకీయంగా సానుభూతి వస్తుందా లేదా అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన తన కుమార్తెను ఎలా ముందుకు నడిపిస్తారు మరియు విజయనగరంలో వైసీపీ క్యాడర్‌ను ఎలా కాపాడుకుంటారు అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu