Gujarat : గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 2008 నాటి అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయించింది. పదకొండు మందికి జీవిత ఖైదు విధించింది.
కింది కోర్టు చెప్పిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. మొత్తం 49 మంది దోషుల శిక్షలను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. జూలై 26, 2008న అహ్మదాబాద్‌లో కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు.
2008 వరస పేలుళ్ల కేసులో...
ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు 2022 ఫిబ్రవరిలో 38 మంది దోషులకు మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దోషులు గుజరాత్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎ.వై. కొగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన డివిజన్ బెంచ్ దోషుల అప్పీళ్లను కొట్టివేసింది Iమొత్తం 49 మంది దోషుల (ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు) శిక్షలను ఖరారు చేసింది ఈ సంచలన తీర్పు ద్వారా సుదీర్ఘంగా సాగిన ఒక అతిపెద్ద ఉగ్రవాద కేసులో బాధితులకు న్యాయం చేకూరినట్లయింది.

