కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ బ్లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, 'X' సంస్థకు నోటీసులు ఢిల్లీ హైకోర్టు జారీ చేసింది.
సోషల్ మీడియాలో ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీకి మిలియన్ల కొద్దీ ఫాలోయిర్స్ ఏర్పడుతున్న నేపథ్యంలో దాని అకౌంట్ ను బ్లాక్ చేశారు.
పునఃసమీక్ష జరపాలని...
'కాక్రోచ్ జనతా పార్టీ' అకౌంట్‌ను బ్లాక్ చేయడంపై అభిజీత్ దిప్కే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బ్లాకింగ్ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాలని ఐటీ శాఖ 'రివ్యూ కమిటీ'కి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో 'కాక్రోచ్ జనతా పార్టీకి న్యాయస్థానంలో ఊరట లభించినట్లయింది.

