హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద చెట్ల నరికివేత పై సుప్రీంకోర్టు స్టే విధించింది. 35 మీటర్ల పరిధిలో చెట్లను నరకవద్దంటూ ఆదేశించింది. కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవడంతో అక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్టు చేపట్టింది.
ఫ్లై ఓవర్ నిర్మాణానికి...అండర్ పాస్ లతో పాటు ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్మాణాల కోసం కేబీఆర్ పార్కు వద్ద ఉన్న కొన్ని చెట్లను నరికి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు దీనిపై స్టే విధించింది. కేసు విచారణను జులై 27వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

