బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టుకు తరలిస్తున్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి దొంగల గడ్డగా మారిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేయకుండా ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని బాల్క సుమన్ ఆరోపించారు. తనపై తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు నమోదయ్యాయయని అన్నారు.
అక్రమ కేసులు పెట్టి...అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల సమయంలో తనను జైల్లో పెట్టారని, మరోసారి అక్రమ కేసులు పెట్టారని బాల్క సుమన్ అన్నారు. తాను ఎక్కడికీ పారిలేదని, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు. తాను న్యాయవ్యవస్థను గౌరవిస్తామని బాల్క సుమన్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తుందని అన్నారు. అయినా కాంగ్రెస్ నేతల కడుపుమంట చల్లారనట్లుందని, సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తాను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ఏందని బాల్క సుమన్ ప్రశ్నించారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదని, తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని బాల్క సుమన్ చెప్పారు.

