Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BRS : తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్

BRS : తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్

TeluguPost.com 1 week ago

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్సుతో పాటు, నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్ కు వచ్చారు.

సింగరేణి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల్కసుమన్ పై మొత్తం ఆరు సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు.

భారీగా మొహరించిన పోలీసులు...

తెలంగాణ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మొహరించారు. పోలీసులు తెలంగాణ భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. పోలీసులు మాత్రం కేసు నమోదయింది కాబట్టి విచారించడానికి వచ్చామని చెబుతున్నారు. గత మూడు రోజుల నుంచి బాల్క సుమన్ తెలంగాణ భవన్ లోనే ఉన్నారని తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం పోలీసులను అడ్డుకుంటున్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu