2024 లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో జరిగిన కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఆడబిడ్డ నిధిని మాత్రం అమలు చేయలేకపోయామని, నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పామని, అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయకపోయామని చంద్రబాబు తెలిపారు.
అలాగే నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని, ఇరవై లక్షల ఉద్యోగాలు త్వరలోనే ఇస్తామని చంద్రబాబు అన్నారు.
కార్యకర్తలు కాలరెగరేసుకుని...
కార్యకర్తలు కాలరెగరేసుకుని ప్రజల వద్దకు వెళ్లి సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని చెప్పండని చంద్రబాబు పిలపు నిచ్చారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసంతోనే కొన్ని పథకాలను అమలు చేయలేకపోయామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళుతున్నామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ గొడ్డలి పార్టీని తరిమి కొట్టాలని చంద్రబాబు సభ నుంచి ప్రజలకు పిలుపు నిచ్చారు.

