Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chandrababu : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్ స్టాపబుల్

Chandrababu : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్ స్టాపబుల్

TeluguPost.com 2 weeks ago

Railway Koduru : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్ స్టాపబుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఎవరైనా అడ్డుకుంటే జగన్నాధ రథచక్రాల కింద నలిగిపోవడం ఖాయమని తెలిపారు.

నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా మారుతుందని చంద్రబాబు తెలిపారు. దేశవ్యాప్తంగా నేటి నుంచి అమలు కానున్న వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజివికా మిషన్ ను రైల్వే కోడూరు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు పాల్గొన్నారు.

లబ్దిదారులకు...

ఈ సందర్భంగా లబ్దిదారులకు వీబీజీ రామ్ జీ జాబ్ కార్డులు కేంద్రమంత్రి, సీఎం, డిప్యూటీ సీఎంలు అందచేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోత్సాహక గీతాన్ని మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ ఆవిష్కరించారు. వీబీజీ రామ్ జీ పథకం సమాచార బుక్ లెట్‌తో పాటు కంపెండియం అఫ్ ఆర్టికల్స్‌ను ఆవిష్కరించారు. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్ పోర్టల్‌ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu