ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనలో తాటిముంజలు తిన్నారు. చంద్రబాబు, ఆయన సతీమణి మార్గమధ్యంలో ఆగి రోడ్డు పక్కన విక్రయిస్తున్న తాటిముంజలను చూసి వాటిని తినాలని ముచ్చట పడ్డారు.
తమ చిన్నతనంలో తాటి ముంజలను తిన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.
చిన్ననాటి రోజులు...చంద్రబాబు దంపతులు బెంగళూరుకు వెళుతూ తిరుగు ప్రయాణంలో తంజమ్మ కొట్టాలు వద్ద ఆగి తాటి ముంజలు తిన్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలకు కల్తీ లేదు... కార్బైడ్ లేదు. పరుగు మందులు అసలే లేవు. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన చల్లనైన తాటిముంజలు తింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉందని అన్నారు. తాటి ముంజలు తిని గీత కార్మికులకు డబ్బులు చెలల్లించారు.

