Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Congress : కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి పెరుగుతుందా? పార్టీకి డ్యామేజీ కాదా?

Congress : కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి పెరుగుతుందా? పార్టీకి డ్యామేజీ కాదా?

TeluguPost.com 14 hrs ago

కాంగ్రెస్ పార్టీలో సీనియర్లలో అసంతృప్తి పెరుగుతుంది. ఇందుకు సీనియర్ నేత షబ్బీర్ ఆలి ఉదాహరణ. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందులకు గురి చేశాయి.

కాంగ్రెస్ పార్టీలో పదవులను డబ్బులు ఇచ్చిన వారికే ఇస్తున్నారని షబ్బీర్ ఆలి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కష్టించి పనిచేసిన నేతలకు కాకుండా అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి డబ్బులు ఇచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని షబ్బీర్ ఆలి చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో కాక రేపాయి. గత కొంత కాలంగా షబ్బీర్ ఆలి అసంతృప్తితో ఉన్నారు.

నాయకత్వం పట్టించుకోవడం లేదనా?

తనను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని ఆయన భావిస్తున్నారు. పైగా కామారెడ్డి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా మరొక నేతను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారని ఆయన భావిస్తున్నారు. గత కొంత కాలం నుంచి షబ్బీర్ ఆలి కి, చంద్రశేఖర్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకంటున్నారు. ఈ ఇద్దరి మధ్య వివాదం నేపథ్యంలోనే షబ్బీర్ ఆలీ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఏఐసీసీ కూడా అంతే స్థాయిలో స్పందించింది. షబ్బీర్ ఆలీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

షబ్బీర్ ఆలీ ఏమన్నారంటే?

అయితే షబ్బీర్ ఆలీ మాత్రం ఆ వ్యాఖ్యలకు, తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పారు. ఆ ఆడియోలో వినిపిస్తున్న వాయిస్ తనది కాదని అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారంటూ షబ్బీర్ ఆలీ వివరణ ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ తో తనకు సుదీర్ఘ కాలం నుంచి తెలుసునని, మంచి మిత్రుడని చెప్పారు. ఆయనపై తాను వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు చేస్తానని షబ్బీర్ ఆలీ అన్నారు. షోకాజ్ నోటీసులకు అవసరమైన సమాధానాన్ని తాను ఇస్తానని కూడా షబ్బీర్ ఆలీ చెప్పారు. మొత్తం మీద కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం కూడా పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన వారిని పట్టించుకోవాలని పలువురు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu