Hyderabad : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన అసంతృప్తిపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీకి దూరంగా ఉంటున్నానన్నది అవాస్తవమని కోమటిరెడ్డి అన్నారు.
పార్టీలో కొన్ని అంశాలను తప్పుపడుతున్నానని, పార్టీని కాదని కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.
రాహుల్ ను ప్రధానిని చేసేందుకు...కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పార్టీ నిర్ణయాలు, కుటుంబ విషయలు చర్చించానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. మానవత్వం ఉన్న గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యమని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

