Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Congress : నేడు బీఎస్ సందీప్.. రాక.. కాకపుడుతుందా?

Congress : నేడు బీఎస్ సందీప్.. రాక.. కాకపుడుతుందా?

TeluguPost.com 10 hrs ago

Telangana : తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నేడు గాంధీభవన్‌లో జరగనుంది. కొత్త ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన బీఎం సందీప్ తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

పార్టీ బలోపేతంపై... పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వం-పార్టీ మధ్య సమన్వయంపై చర్చిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు సమీక్ష నిర్వహిస్తారు. పార్టీ నేతల బహిరంగ వ్యాఖ్యలు, క్రమశిక్షణ అంశాలపై పరిశీలన జరుపుతారు . రెండు రోజుల పర్యటనలో భాగంగా బీఎం సందీప్ పీఏసీతో పాటు పీసీసీ, విస్తృత కార్యవర్గ సమావేశాల్లోనూ పాల్గొననున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని పిలిచి మాట్లాడే అవకాశముంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu