Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Delhi : ఢిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం

Delhi : ఢిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం

TeluguPost.com 3 weeks ago

Delhi : ఢిల్లీలో ఉగ్రదాడి కుట్రను స్పెషల్ పోలీసులు భగ్నం చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పట్టుబడిన నిందితుల్లో ముగ్గురు పంజాబ్, ఒకరు ఢిల్లీ వాసులుగా గుర్తించారు.

ఈ ప్రాంతాల్లో కుట్రకు ప్లాన్...ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టి ఆదేశాలతో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశారు. ఢిల్లీలో పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద నిందితుల రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రెండు విదేశీ పిస్టల్స్, 9 తూటాలు, 5 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ నంబర్లతో పాక్ హ్యాండ్లర్లతో నిందితుల సంప్రదింపులు జరిపారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాలు అందుకుంటున్నట్లు గుర్తించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu