ఢిల్లీలో నేటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు చర్యలు పాటించాలని సూచించడంతో ప్రభుత్వ శాఖలు వర్క్ ఫ్రం హోంకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఇంటి నుంచే పనులు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అందుకు అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉండనుంది.
కొందరికి మాత్రమే...
ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వ, మున్సిపల్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. వారంలో రెండు రోజుల పాటు వర్క్‌ఫ్రమ్ హోమ్ చేయాలని తెలిపింది. బుధ, శనివారాల్లో వర్క్‌ఫ్రమ్ హోమ్ అమలు చేయనుంది. దీనివల్ల ఇంధనాన్ని పొదుపు చేయడం సాధ్యమవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

