వైసీపీ పై బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే రెండేళ్ల పాలనలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చిందని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.
డీఎస్పీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. విద్యా విధానంలో 241 కేసులు కోర్టులో వేశారని, దీని వెనుక వైసీపీ ఉందని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఆరోపించారు. క్రీడలను కులానికి అంటించి కుట్ర చేసింది వైసీపీ అని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగుల్లో అనుమానాలు సృష్టించటానికి వైసీపీ కుట్ర చేస్తోందని అన్న విష్ణు వర్ధన్ రెడ్డి డీఎస్పీపై వైసీపీ కుట్రలు చేస్తోందని స్పష్టం అవుతోందన్నారు.
లోకేశ్ పనితీరును... విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెరుగైన పనితీరును ఓర్చుకోలేక వైసీపీ అక్కసు వెళ్లగక్కుతోందని చెప్పారు. భవిష్యత్తు లో కూడా వైసీపీని యువత క్షమించదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం వైసీపీ కి ఇస్తాం లేదని చెప్పారు. దేశం లో , రాష్ట్రాల్లో జన రంజక పాలన సాగుతోందన్నారు. ఎన్డీయే పాలన ప్రజల్లో మరింత అభివృద్ధితో ముందుకు పోతుందని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి చెప్పారు. తనను హత్య చేస్తామని గుర్తు తెలియని ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ఉర్దూలో లో మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారని, ఐదు రోజుల క్రితం కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశానని, కదిరి పోలీసుల చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, లేకుంటే న్యాయస్థానం ఆశ్రయిస్తానని విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.

