Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ebola outbreak : ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ..కాంగో-ఉగాండాలో ఈబోలా

Ebola outbreak : ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ..కాంగో-ఉగాండాలో ఈబోలా

TeluguPost.com 6 days ago

దివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చిరికలు జారీ చేసింది. కాంగో, పొరుగు ఉగాండాలో వ్యాపిస్తున్న ఈబోలా వ్యాధిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

మూడు వందలకుపైగా అనుమానిత కేసులు, 88 మరణాలు నమోదవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.అయితే, ఇది కోవిడ్-19లాంటి మహమ్మారి ప్రమాణాలకు సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దులు మూసివేయాల్సిన అవసరం లేదని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు కాంగోలోని ఇటురి ప్రావిన్స్‌లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడి నుంచి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని కిన్షాసాలో కూడా ప్రయోగశాలలో నిర్ధారిత కేసు నమోదైంది. ఆ వ్యక్తి ఇటురికి వెళ్లి వచ్చినట్లు వెల్లడైంది. ఉత్తర కివు ప్రావిన్స్‌లో కూడా అనుమానిత కేసులు బయటపడుతున్నాయి. ఇది ఇటురికి ఆనుకుని ఉంది.తూర్పు కాంగోలోని అతిపెద్ద నగరం గోమాలో కూడా తొలి నిర్ధారిత కేసు బయటపడినట్లు అక్కడి తిరుగుబాటు పాలన ప్రకటించింది. బాధితుడు ఇటురి నుంచి వచ్చినట్లు, ప్రస్తుతం వేరుగా ఉంచినట్లు తెలిపింది. 2025 ప్రారంభంలో గోమా ప్రాంతంలో తిరుగుబాటుదారుల దాడులు జరిగాయి. కాంగో సైన్యం, రువాండా మద్దతు ఉన్న ఎం23 తిరుగుబాటు బలగాల మధ్య ఘర్షణల వల్ల లక్షలాది మంది నివాసాలు వదిలి వెళ్లారు.

అరుదైన ప్రాణాంతకం..ఈబోలా వైరస్ వాంతులు, రక్తం, వీర్యం వంటి శరీర ద్రవాల ద్వారా సులభంగా అంటుకుంటుంది. ఈ వైరస్ వల్ల కలిగే వ్యాధి అరుదైనా, తీవ్రమైనది, ప్రాణాంతకం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అత్యవసర ప్రకటనతో దేశాలు, దాత సంస్థలు తక్షణ చర్యలు చేపట్టాలని ఉద్దేశించింది. అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో చర్యలు అవసరమని సూచించింది. ఇటురి రాజధాని బునియాకు WHO, కాంగో ఆరోగ్య శాఖకు చెందిన 35 మంది నిపుణుల బృందం చేరింది. వారితో పాటు 7 టన్నుల అత్యవసర వైద్య సామగ్రి కూడా తీసుకువచ్చారు. గతంలో ఇలాంటి అత్యవసర ప్రకటనలపై ప్రపంచ స్పందన మిశ్రమంగా ఉండిందని నిపుణులు చెబుతున్నారు. 2024లో mpox వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసరంగా ప్రకటించినప్పటికీ, ప్రభావిత దేశాలకు పరీక్షలు, ఔషధాలు, టీకాలు వేగంగా చేరలేదని అప్పట్లో అభిప్రాయాలు వెలువడ్డాయి.చికిత్స, టీకాలు లేని బండిబుగ్యో వైరస్...ప్రస్తుతం వ్యాపిస్తున్న ఈ వ్యాధికి కారణం బండిబుగ్యో వైరస్ అని ఆరోగ్య అధికారులు నిర్ధారించారు. ఇది ఈబోలా వైరస్‌లో అరుదైన రకం. దీనికి ఇప్పటివరకు అనుమతించిన చికిత్సా విధానాలు, టీకాలు లేవు. కాంగో, ఉగాండాల్లో గతంలో 20కుపైగా ఈబోలా ప్రబలాలు నమోదయ్యాయి. అయితే, బండిబుగ్యో వైరస్ గుర్తించినది ఇది మూడోసారి మాత్రమే.కేసుల్లో ఎక్కువ భాగం కాంగోలోనే ఉన్నాయి. రెండు కేసులు మాత్రమే ఉగాండాలో నమోదయ్యాయి. 2007-08లో ఉగాండాలోని బండిబుగ్యో జిల్లాలో 149 మందికి ఈ వైరస్ సోకి, 37 మంది మరణించారు. 2012లో కాంగోలోని ఇసిరోలో 57 కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి. కాంగో జాతీయ ప్రజారోగ్య సంస్థలో పనిచేస్తున్న రిచర్డ్ కిటెంగే మాట్లాడుతూ, "గతంలో కూడా చికిత్స లేకుండా మేము అనేక వ్యాధులను ఎదుర్కొన్నారు. జైర్ వైరస్ సమయంలో కూడా అందరూ మరణించలేదు" అని చెప్పారు.ఘర్షణలు, వలసలు అదుపు ప్రయత్నాలకు అడ్డంకి...ఆఫ్రికా వ్యాధి నియంత్రణ కేంద్రాల అధిపతి జీన్ కాసేయా మాట్లాడుతూ, "మొదటి కేసులు బయటపడిన మోంగ్వాలులో ఇంకా అనేక మంది రోగులు సమాజంలోనే ఉన్నారు. ఇది వ్యాధిని అదుపులోకి తేవడాన్ని కష్టతరం చేస్తోంది" అన్నారు.ఐఎస్ఐఎస్ మద్దతు ఉన్న మిలిటెంట్ల హింస, గనుల పనుల వల్ల జన సంచారం, ఉగాండా సరిహద్దు దాటే కదలికలు కూడా నియంత్రణకు సవాల్‌గా మారాయి.ఏప్రిల్‌లోనే ఈ వ్యాప్తి ప్రారంభమైనట్లు సమాచారం. తొలి కేసు ఎవరనేది ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 24న లక్షణాలు కనిపించిన 59 ఏళ్ల వ్యక్తి, ఏప్రిల్ 27న ఆసుపత్రిలో మరణించాడు.మే 5న సామాజిక మాధ్యమాల ద్వారా అధికారులకు సమాచారం చేరేసరికి ఇప్పటికే 50 మరణాలు నమోదయ్యాయని ఆఫ్రికా CDC తెలిపింది. ఈబోలా లక్షణాలు కనిపించిన నలుగురు ఆరోగ్య సిబ్బంది కూడా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రేయేసస్ మాట్లాడుతూ, "వాస్తవంగా ఎంతమంది బాధితులున్నారు, వ్యాప్తి ఎంతదూరం జరిగింది అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు" అని చెప్పారు.ఉగాండాలో నమోదైన రెండు కేసుల్లో ఒకరు కాంగో నుంచి వచ్చి కంపాలా ఆసుపత్రిలో మరణించారు. మరొకరు కూడా కాంగో నుంచి వచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఇటురిలో చోటుచేసుకున్న మరణాల గుంపులు, ఉగాండా రాజధాని కంపాలాకు వ్యాప్తి సూచనలు, పరీక్షల్లో అధికంగా పాజిటివ్ కేసులు రావడం చూస్తే ప్రస్తుతం నమోదవుతున్న దానికంటే విస్తృతంగా వ్యాధి వ్యాపించి ఉండొచ్చని WHO అంచనా వేసింది.అమెరికాకు ప్రమాదం తక్కువ...అమెరికా ఆరోగ్య అధికారులు అమెరికన్లకు ప్రమాదం తక్కువగా ఉందని పేర్కొన్నారు. అయితే, ఎవరైనా వైరస్‌కు గురయ్యారా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.CDC అధికారి సతీష్ పిల్లై మాట్లాడుతూ, "వ్యాప్తిని అదుపు చేయడానికి ఇతర ఆరోగ్య సంస్థలతో కలిసి పని చేస్తున్నాం" అన్నారు. కాంగోలో ఇప్పటికే 30 మంది సిబ్బందితో CDC కార్యాలయం ఉంది. మరిన్ని బృందాలను పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.కాంగో, ఉగాండాలకు వెళ్లే అమెరికన్లు జ్వరంలాంటి లక్షణాలు ఉన్నవారిని దూరంగా ఉండాలని CDC సూచించింది. ప్రవేశ ద్వారాల వద్ద కూడా లక్షణాల గుర్తింపుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu