ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు.లిక్కర్ కేసులో ముడుపుల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.
గతంలోనూ ఒకసారి ఈడీ అధికారులు విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు.
మనీలాండరింగ్...మద్యం పాలసీలో అవకతవకలు, మనీ లాండరింగ్, డబ్బు మళ్లింపుపై నేడు విచారణ జరుగుతుంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, విధాన నిర్ణయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. తన సమక్షంలో లిక్కర్ పాలసీ భేటీలు మూడు సార్లు జరిగినట్లు సాయిరెడ్డి ఈడీ అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది.

