ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 31వ తేదీన విచారణకు రావాలని సమన్లలో పేర్కొన్నారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు కేటీఆర్ నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసింది.
మరికొందరికి కూడా...కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవిందకుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి ని చేర్చింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో అవినీతి జరిగిందని ఏసీబీ దర్యాప్తు చేసిన నేపథ్యంలో కోర్టు నిందితులందరికీ సమన్లు జారీ చేసింది.

