Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్యాక్ట్ చెక్: కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకున్న ఘటనను అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన హిందువులపై జరిగిన దాడిలా ప్రచారం చేస్తున్నారు

ఫ్యాక్ట్ చెక్: కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకున్న ఘటనను అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన హిందువులపై జరిగిన దాడిలా ప్రచారం చేస్తున్నారు

TeluguPost.com 2 weeks ago

2026 సంవత్సరానికి సంబంధించిన అమర్‌నాథ్‌ యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తుల తొలి బృందం బాల్‌టాల్‌, నున్వాన్‌ బేస్‌ క్యాంప్‌ల నుంచి బయలుదేరింది.

యాత్ర ప్రారంభమైన మొదటిరోజే భారీ వర్షం కురవడంతో కొండమార్గాలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా మంచు లింగ దర్శనం కోసం ముందుకు సాగుతున్నారు. 4,882 మంది యాత్రికులతో కూడిన తొలి బృందాన్ని భాగవతి నగర్‌ యాత్రీ నివాస్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. 3800 మంది భక్తులతో కూడిన రెండో బృందం జమ్మూ బేస్‌ క్యాంప్‌ నుంచి బయలు దేరింది.

జూలై 3న ప్రారంభమైన ఈ యాత్ర 57 రోజులపాటు సాగుతుంది. రక్షా బంధన్ రోజైన ఆగష్టు 28న యాత్ర పూర్తవుతుంది. భక్తుల భద్రత దృష్ట్యా, ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో అధికారులు అమర్‌నాథ్‌ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్ర సాగే మార్గంలో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఇండియన్ ఆర్మీతోపాటు వివిధ బలగాలు ఇక్కడ భద్రత కల్పిస్తు్న్నాయి. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఇంతలో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ సమీపంలో అమర్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై దాడి జరిగిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు

వైరల్ ఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదుమేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ నిర్వహించాం. అయితే శ్రీనగర్‌లోని లాల్ చౌక్ సమీపంలో అమర్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై దాడి జరిగిందంటూ ఎలాంటి కథనాలు మాకు లభించలేదు. అలాంటి ఘటన చోటు చేసుకుని ఉండి ఉంటే అది తప్పకుండా మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది.అగ్నిప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. వైరల్ విజువల్స్ తో సరిపోయేలా జులై నెలలో కర్ణాటక రాష్ట్రంలో బస్సు కాలిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో మాకు లభించింది. కేరళ ట్రాన్స్పోర్ట్ బస్సు బెంగళూరు నగరంలో కాలిపోయిన ఘటనకు సంబంధించిన విజువల్స్ అని తేలింది. అందుకు సంబంధించిన మీడియా కథనాలను ఇక్కడ చూడొచ్చు.

టైమ్స్ నౌ KSRTC Bus Catches Fire In Bengaluru: Driver, Conductor Rescue Two Passengers Onboard | వాచ్ అనే టైటిల్ తో అప్లోడ్ చేసిన వైరల్ వీడియోలోని విజువల్స్ మాకు లభించాయి.

బస్సు వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో బస్సు ముందు భాగం, లోపలి భాగం దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు, బస్సులోని ఇద్దరు ప్రయాణికులు, కండక్టర్, డ్రైవర్ ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకున్నారని మీడియా నివేదికలు తెలిపాయి. పలు మీడియా సంస్థల నివేదికలకు సంబంధించిన థంబ్ నైల్స్ లో కూడా వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్ తో సరిపోలాయి.

ఇక వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా నివేదించాయి.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu