Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్యాక్ట్ చెక్: సోఫాలో కూర్చున్నందుకు బీజేపీ కార్యాలయంలోనే ఓ దళిత కార్మికుడిపై దాడి చేశారంటూ తప్పుడు వాదనతో వీడియోని షేర్ చేస్తున్నారు

ఫ్యాక్ట్ చెక్: సోఫాలో కూర్చున్నందుకు బీజేపీ కార్యాలయంలోనే ఓ దళిత కార్మికుడిపై దాడి చేశారంటూ తప్పుడు వాదనతో వీడియోని షేర్ చేస్తున్నారు

TeluguPost.com 3 months ago

కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తనను భారతీయ జనతా పార్టీలో చేరాలని కొందరు బెదిరిస్తున్నారని తెలిపారు.

బీజేపీలో చేరకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారని, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ బెదిరింపులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు దీప్కే తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారిపై ఇలా బెదిరింపులకు పాల్పడటం ఆందోళనకరమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని, ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. నిరసనకారులపై పోలీసులు బలప్రయోగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. యువతను భయభ్రాంతులకు గురిచేయాలనే కుట్రలు ఎప్పటికీ విజయవంతం కావని అభిజిత్ హెచ్చరించారు. దేశ భవిష్యత్తు కోసం యువత గళం ఎత్తుతూనే ఉంటుందని, ఎలాంటి బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు

బీజేపీ కార్యాలయంలో దళిత కార్యకర్త సోఫాలో కూర్చున్నందుకు దాడి చేశారంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.

"ఆగ్రా బీజేపీ కార్యాలయంలో దళిత కార్యకర్తపై దాడి.

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని బీజేపీ కార్యాలయంలో సోఫాపై కూర్చున్నాడనే కారణంతో ఓ దళిత కార్యకర్తపై దాడి జరిగిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సామాజిక సమానత్వం గురించి మాట్లాడే పార్టీ ఆఫీస్‌లోనే ఇలాంటి ఘటన జరగడంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు." అంటూ పోస్టులు పెట్టారు.

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని చూపుతున్న జూలై 2025 నాటి పలు వార్తా కథనాలు లభించాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహంలో చోటు చేసుకుందని మీడియా నివేదించింది. ఈ వీడియోకు ఆగ్రా, బీజేపీ లేదా దళిత కార్యకర్తపై దాడికి ఎలాంటి సంబంధం లేదు. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎన్‌సీపీకి చెందిన అజిత్ పవార్ వర్గం కార్యకర్తలు, అఖిల భారత ఛావా సంఘటనా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన పాత వీడియో.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో 2025 జూలైలో మాకు పలు మీడియా సంస్థల కథనాలు లభించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 'లాతూర్‌లో ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే విలేకరుల సమావేశం వద్ద ఒక మరాఠా సంస్థ చేపట్టిన నిరసన గందరగోళానికి దారితీసింది. అసెంబ్లీ సమావేశం సందర్భంగా తన ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవసాయ మంత్రి మాణిక్రావ్ కోకాటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఛావా సంఘటనా సభ్యులు తట్కరేపై పేకముక్కలు విసిరారు. దీంతో స్థానిక ఎన్‌సిపి కార్యకర్తలు ఆ మరాఠా సంస్థకు చెందిన కొందరు సభ్యులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విజయ్‌కుమార్ ఘడ్గే నేతృత్వంలోని ఛావా సంఘటనా, కోకాటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తట్కరేకు మొదటగా ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. ఛావా సంఘటనా కార్యకర్తలు కోకాటేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తట్కరేపై పేకముక్కలు విసిరారు. తట్కరే ఆ ప్రాంగణం నుండి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే, స్థానిక ఎన్‌సిపి రాజకీయ నాయకులు సమీపంలోని ఒక గదిలో ఉన్న ఛావా సంఘటనా కార్యకర్తల వద్దకు వెళ్లి వారిపై దాడి చేయడం ప్రారంభించినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, ఒక ఎన్‌సిపి కార్యకర్త ఛావా సంఘటనా సభ్యుడి తలపై కుర్చీతో కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.' ఈ ఘటనపై 'ఇండియా టుడే' విజయ్ ఘడ్గేను వివరణ కోరగా, తాను దళితుడిని కానని, మరాఠా సామాజిక వర్గానికి చెందిన వాడినని ఆయన స్పష్టం చేశారు. ఆ రోజు దాడికి గురైన తమ కార్యకర్తల్లో కొందరు ఓబీసీలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.

మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

వైరల్ పోస్టులోని వీడియో.. ఇక్కడ ఉన్న వీడియో ఒకటేనని స్పష్టంగా తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన FIR కాపీని ఇక్కడ చూడొచ్చు

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. సోఫాలో కూర్చున్నందుకు బీజేపీ కార్యాలయంలోనే ఓ దళిత కార్మికుడిపై దాడి జరగలేదు. వేరే ఘటనకు సంబంధించిన గొడవను బీజేపీకి ఆపాదిస్తూ ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu