Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియో మణిపూర్ లో భారత సైన్యంపై జరిగిన దాడికి సంబంధించింది కాదు

ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియో మణిపూర్ లో భారత సైన్యంపై జరిగిన దాడికి సంబంధించింది కాదు

TeluguPost.com 1 week ago

కేంద్ర భద్రతా సంస్థలు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిషేధిత మణిపురి మిలిటెంట్ సంస్థ 'కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (KCP)' టాప్ కమాండర్ హౌబిజామ్ దిలీప్ సింగ్ ఢిల్లీలో అరెస్టయ్యాడు.

అధికారుల సమాచారం ప్రకారం, ఒక "రహస్య సమావేశం"లో పాల్గొనేందుకు దిలీప్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నాడు. అతని పర్యటన వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉండి ఉంటుందని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. అతను ఎవరిని కలవడానికి వచ్చాడు, అతని ఉద్దేశ్యం ఏమిటి అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద నమోదైన 12కు పైగా కేసులతో సహా పలు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో దిలీప్ సింగ్ వాంటెడ్‌గా ఉన్నాడు. దిలీప్ సింగ్ అరెస్టు, విచారణలో వెల్లడించిన సమాచారం మేరకు, మణిపూర్‌లోని కక్చింగ్ జిల్లాలో భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో AK-56 రైఫిల్స్, అమోఘ్ రైఫిల్, AI రైఫిల్, M4 రైఫిల్‌, INSAS, AK-సిరీస్, SLR, LMG రైఫిల్స్‌కు చెందిన పలు మ్యాగజైన్‌లు ఉన్నాయి.

51 హై-ఎక్స్‌ప్లోజివ్ బాంబులు, రెండు పారా బాంబులు, 11 డిటోనేటర్లు, దాదాపు 2,000 రౌండ్ల లైవ్ మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు సీజ్ చేశాయి. వీటితో పాటు ఒక మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులను కూడా రికవరీ చేశారు. మణిపూర్ లేదా ఇతర ప్రాంతాలలో భారీ స్థాయిలో హింసాత్మక దాడులకు పాల్పడేందుకే ఈ ఆయుధాలు, పేలుడు పదార్థాలను సమకూర్చుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో అతని కదలికలు, కాంటాక్ట్‌లపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరా తీస్తున్నాయి.

"మణిపూర్ శివార్లలో కొత్తగా ఏర్పాటు చేసిన అస్సాం రైఫిల్స్ శిబిరంపై మణిపూర్ స్వాతంత్ర్య సమరయోధులు దాడి చేశారు." అంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు

వైరల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ నిర్వహించాం. అయితే అస్సాం రైఫిల్స్ శిబిరంపై ఇటీవలి కాలంలో దాడి జరిగినట్లుగా ఎలాంటి నివేదిక మాకు లభించలేదు.

మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ యూనిట్‌తో జరిగిన కాల్పుల్లో కనీసం పది మంది మిలిటెంట్లు మరణించారని భారత సైన్యం తెలిపింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని కూడా తెలిపింది. "ఇండో-మయన్మార్ సరిహద్దు సమీపంలోని చందేల్ జిల్లా ఖెంగ్‌జోయ్ తహసీల్, న్యూ సమతాల్ గ్రామం సమీపంలో సాయుధ కేడర్ల కదలికలపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ యూనిట్ 2025 మే 14న ఆపరేషన్ ప్రారంభించింది" అని ఆర్మీ కమాండ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది.

ఇక వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్ తీసుకుని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. వైరల్ కీఫ్రేమ్‌లలో ఒకటి మే 2, 2026న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) అధికారిక X హ్యాండిల్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్‌కు దారితీసింది. ఆ పోస్ట్‌లో అనేక చిత్రాలు, ఒక వీడియో ఉన్నాయి, అవి సోషల్ మీడియాలోని వైరల్ పోస్ట్‌ తో సరిపోలాయి.

ఆ పోస్ట్‌ను సమీక్షించిన తర్వాత, లేహ్‌లోని చోగ్లమ్సార్‌లో సింధు నది ఒడ్డున చెలరేగిన ఒక అటవీ అగ్నిప్రమాదాన్ని ఆ వీడియో చూపిస్తోందని, లేహ్ ఆధారిత యూనిట్లకు చెందిన ITBP సిబ్బంది దానిని త్వరగా అదుపులోకి తెచ్చారని మేము కనుగొన్నాము. అందులో, మణిపూర్ స్వాతంత్ర్య సమరయోధులు కొత్తగా ఏర్పాటు చేసిన అస్సాం రైఫిల్స్ శిబిరంపై దాడి చేసినట్లు ప్రస్తావించలేదు.

PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ తేల్చి చెప్పింది. 'javedeqbalpk1' అనే పాకిస్తానీ ప్రచార ఖాతా, మణిపూర్ శివార్లలో కొత్తగా ఏర్పాటు చేసిన అస్సాం రైఫిల్స్ శిబిరంపై మణిపూర్ స్వాతంత్ర్య సమరయోధులు దాడి చేశారని పేర్కొంటూ ఒక వీడియోను ప్రచారం చేస్తోందని, ఇదంతా అబద్ధం అని స్పష్టం చేసింది.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu