గాంధీ భవన్ లో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశం జరిగింది. పార్లమెంట్ ఇన్‌చార్జ్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై చర్చ జరుగుతుంది.
సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై...ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. హైదరాబాద్ పరిధిలో పార్టీ బలోపేతంపై చర్యలు తీసుకోవాలని, SIR ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. జూన్ 25వ తేదీ నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

