Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gold Prices Today : కొనాలంటే ఇప్పుడేనట.. తర్వాత ఇక కొనలేకపోవచ్చు

Gold Prices Today : కొనాలంటే ఇప్పుడేనట.. తర్వాత ఇక కొనలేకపోవచ్చు

TeluguPost.com 1 week ago

Hyderabad : బంగారం, వెండి ధరల్లో అనిశ్చితి కొనసాగుతుంది. కొనేవారు లేరు. డిమాండ్ పూర్తిగా పడిపోయింది. అమ్మకాలు నిలిచిపోవడంతో ధరలు కూడా అదుపులోనే ఉన్నాయి.

ప్రతి రోజూ స్థిరత్వం లేకుండా సాగే బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బులియన్ మార్కెట్ లో ఇంతటి గోల్డ్ క్రైసిస్ గతంలో ఎన్నడూ చూడలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పెరగడమో, తగ్గడమో జరిగేవి. కానీ గత ఆరు నెలల నుంచి పెద్దగా ధరలు పెరగకపోవడం, అలాగే భారీగా తగ్గకపోవడంతో వినియోగదారులు కూడా కొనుగోలు విషయంలో ఆలోచనలో పడ్డారు.

యుద్ధ మేఘాలు ఇంకా...

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదు. చర్చలు కొనసాగుతున్నాయంటారు. కానీ ముగింపు ఎప్పుడో చెప్పలేని పరిస్థితి. ఇరాన్ చర్చలకు ఇష్టపడటం లేదు. మరొకసారి యుద్ధం జరుగుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఈ భయాందోళనల ప్రభావం బంగారం, వెండి మార్కెట్ పై పడిందని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ఎంతకాలం ఇలా అనిశ్చితి కొనసాగుతుందో చెప్పలేమని, అయితే ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని, బంగారం, వెండి ధరలు ఎప్పటికైనా పెరుగుతాయని, ఇప్పుడు కొనుగోలు చేస్తే భవిష్యత్ లో మరింతగా పెరిగి లాభాలు తెచ్చిపెడతాయని అంటున్నారు.

కస్టమర్లు లేక ...

కస్టమర్లు లేక జ్యుయలరీ దుకాణాలు వెలవెల బోతున్నాయి. అదే సమయంలో ధరల్లో నిలకడ లేకపోవడంతో మదుపు దారులు కూడా ముందుకు రావడం లేదు. బంగారంపై పెట్టుబడి సురక్షితం కాదని భావించి మొగ్గు చూపడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,32,190 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,220 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,34,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు పెరగవచ్చు. తగ్గవచ్చు. మార్పులు మాత్రం ఉంటాయి.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu