Dailyhunt
Gold Rates Today : గోల్డ్ లవర్స్ గుడ్ న్యూస్... ఎంత తగ్గాయో తెలుసా?

Gold Rates Today : గోల్డ్ లవర్స్ గుడ్ న్యూస్... ఎంత తగ్గాయో తెలుసా?

TeluguPost.com 1 week ago

బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ధరలు తగ్గితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. బంగారం, వెండి ధరల విషయంలో ప్రతి ఒక్కరూ నిత్యం అలెర్ట్ గా ఉంటారు.

బంగారం, వెండి వస్తువులు విషయంలో ఎవరూ రాజీ పడరు. అదే సమయంలో బంగారం, వెండి వస్తువుల కొనుగోలుకు అందరూ ఇష్టపడతారు. మహిళలే కాదు.. పురుషులు కూడా బంగారాన్ని, వెండిని పెట్టుబడిగా భావించి వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అందుకే బంగారానికి, వెండికి ఎప్పుడూ భారత దేశంలో డిమాండ్ తగ్గదు.

నష్టపోయిన వారు...

బంగారాన్ని సొంతం చేసుకోవడానికి అవసరమైతే క్రెడిట్ కార్డులు వాడటం కూడా చేస్తారు. అయితే ఇటీవల అప్పులు చేసి బంగారాన్ని కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టాలపాలయ్యారు. బంగారం, వెండి ధరలు పెరిగినా... తగ్గినా ప్రత్యేక కారణాలు అనేకం ఉంటాయి. అందులో భాగంగా అంతర్జాతీయంగా ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ బలపడటం, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో బంగారం, ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. రానున్నకాలంలో ధరలు ఎలా ఉంటాయన్నది కూడా ఇప్పుడు అంచనా వేయలేని పరిస్థితి.

నేటి ధరలు...

మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ జరుగుతుండటంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. ధరలు పెరిగినా, తగ్గినా శుభకార్యాలకు బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయడం అలవాటు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,37,140 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,49,610 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,69,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu