Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Guatemala volcano eruption : అగ్నిపర్వతం విస్ఫోటనం.. వందల మంది తరలింపు

Guatemala volcano eruption : అగ్నిపర్వతం విస్ఫోటనం.. వందల మంది తరలింపు

TeluguPost.com 3 weeks ago

Guatemala City : మధ్య అమెరికాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన ఫ్యూగో అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత గ్వాటెమాలా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగమైన ఈ అగ్నిపర్వతం సోమవారం ఉదయం నుంచి బూడిద, వాయువులను భారీగా వెదజల్లుతోంది. లావా, అత్యంత వేడిగా ఉండే పైరోక్లాస్టిక్ ప్రవాహాలు కొండ దిగువకు చేరుతున్నాయి.

659 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు...

ప్రమాద ప్రాంతంలోని ఎనిమిది గ్రామాల నుంచి 659 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి సమీపంలోని ఆశ్రయ కేంద్రాల్లో వసతి కల్పించారు. ఎల్ పోర్వెనిర్, లాస్ లాజిటాస్ గ్రామాల నుంచి మాత్రమే దాదాపు 250 మందిని తరలించినట్లు గ్వాటెమాలా విపత్తు నిర్వహణ సంస్థ (కాన్‌రెడ్‌) తెలిపింది. బూడిద సమీప పట్టణాలకు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించింది.కాన్‌రెడ్ కార్యనిర్వాహక కార్యదర్శి క్లాడిన్ ఒగాల్డెస్ మాట్లాడుతూ, మరో పది ప్రాంతాల ప్రజలను కూడా మంగళవారం తరలించే అవకాశం ఉందని చెప్పారు.

హైవే మూసివేత.. పాఠశాలలకు సెలవు...

అగ్నిపర్వతానికి సమీపంగా వెళ్లే జాతీయ రహదారి-14ను అధికారులు మూసివేశారు. సమీప పట్టణాల్లో పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.2018 జూన్‌లో ఫ్యూగో అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందినప్పుడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. ఆ ఘటన వల్ల దాదాపు 17 లక్షల మంది ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది జూన్‌లో కూడా అగ్నిపర్వతం విస్ఫోటనం కావడంతో ముందుజాగ్రత్తగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu