Telangana : కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించుకు పోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తుందని, ఇక్కడి రైతులను నిలువునా మోసం చేస్తుందని హరీశ్ రావు ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే...తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయన్న హరీశ్ రావు, రేవంత్ చేతకాని పాలన వల్లే ఏపీకి కృష్ణా జలాలు పోతున్నాయని విమర్శించారు. దేశమంతా ఎల్‌నినో ప్రభావం ఉన్న తరుణంలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టాల్సిన అవసరముందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.

