Hyderabad : కాళేశ్వరంపై రేవంత్ నెగెటివ్ మైండ్‌సెట్‌తో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.
కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే ఎన్.డి.ఎస్.ఏ సాకు చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మరి సమ్మక్క బ్యారేజీ మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని హరీశ్ రావుప్రశ్నించారు.
కుంటిసాకులు చెబుతూ...
ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజీ దగ్గర లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉందని హరీశ్ రావు తెలిపారు. మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతుందని హరీశ్ రావు అన్నారు. గోదావరి నీళ్లు తీసుకోవాలన్న కనీస సోయి లేదని అన్నారు. చెరువులు నింపుకునే అవకాశం ఉన్నా.. నింపడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

