Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Heavy Rain : నేడూ హైదరాబాద్ లో కుండపోత.. అలెర్ట్

Heavy Rain : నేడూ హైదరాబాద్ లో కుండపోత.. అలెర్ట్

TeluguPost.com 6 days ago

Hyderabad : హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. సరూర్‌నగర్‌, హస్తినాపురం, ఉప్పల్‌లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఈ కుండపోత వాన పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. నేడు కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అత్యధిక వర్షపాత నమోదు...

నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకూ హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. చార్మినార్‌, హయత్‌నగర్‌, బాలాపూర్‌, నాంపల్లి, గోల్కొండ, రాజేంద్రనగర్‌లో భారీ వర్షం పడింది. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో హైడ్రా సహాయక చర్యలు చేపట్టింది. సహాయక చర్యల్లో హైడ్రా, డీఆర్ఎఫ్, ఎంఆర్టీ బృందాలు పాల్గొన్నాయి. మోటార్ల సాయంతో రోడ్లపై నీరు తొలగించారు. సరూర్‌నగర్‌-11.2, ఉప్పల్‌-8.1, బండ్లగూడ-7.9హయత్‌నగర్‌లో 7.2 సెం.మీ వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu