Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Heavy Rains : కేరళలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు

Heavy Rains : కేరళలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు

TeluguPost.com 1 week ago

Kerala : కేరళలోని ఇడుక్కిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని చెబుతున్నారు.

కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. కేరళ, ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో శనివారం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. అలాగే, ఈ శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు.

ముగ్గురి మృతి...వాగమాన్ జిల్లాలో కూడా కొండచరియలు విరిగిపడటం వల్ల ఒకరు మరణించారు. ప్రభాకరన్ నాయర్ అనే వ్యక్తి మృతదేహం ఇంకా లభించలేదు. అడూర్‌మాలా ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడటంతో ఒకరు చిక్కుకుపోయారు.అలాగే, కోచి-ధనుష్‌కోడి నేషనల్ హైవే, మాచిప్లావు వద్ద కూడా కొండచరియలు విరిగిపడిన కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇడుక్కి జిల్లాలోని ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఇంట్లో ఉన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. కొట్టాయం జిల్లాలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయారు. కేరళలోని అనేక ప్రాంతాలకు ఆరెంజ్, రెడ్ అలెర్ట్ జారీ చేశారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu