Telangana : తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు తెలియజేశారు. కోర్టులు, న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందంటూ రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేశారు.
లోతుకుంట సర్వే నెంబర్ 1, 2లోని భూమిలోకి వెళ్లలేదని రంగనాథ్ అఫడవిట్ లో పేర్కొన్నారు. కోర్టుకు పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని రంగనాథ్ తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఇన్ని ఎక్కువ ఎందుకు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ఆయన ఈ అఫడవిట్ దాఖలు చేశారు.
తప్పుడు సమాచారం ఇస్తున్నారని...చట్టబద్ధంగా నడుచుకునే సంస్థ హైడ్రా అని రంగనాథ్ తెలిపారు. న్యాయ వ్యవస్థపై పూర్తి గౌరవం ఉందన్న రంగనాథ్‌కోర్టులకు కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. ఒకచోట భూమి చూపిస్తూ మరోచోట కబ్జా చేస్తున్నారని, ప్రైవేట్ భూముల్లోని పార్కుల స్థలంలోనే హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసిందని, రూ.లక్షన్నర కోట్ల విలువైన 3,350 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని, 25 చెరువులను పునరుద్ధరిస్తున్నామని రంగనాథ్ తెలిపారు.

