హైదరాబాద్ లోని అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కారులో వచ్చి యువతిని నలుగురు వ్యక్తులుకిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. పీవీ ఎక్స్ ప్రైస్ హైవే మీదుగా హైదరాబాద్ నగరంలోకి వెళ్లినట్లుగా పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో గుర్తించారు.
ఫిర్యాదు అందలేదని...అయితే హైదరాబాద్ నగర పరిధిలోని ఏ పోలీస్ స్టేషన్ లో యువతి మిస్సింగ్ కేసు మాత్రం నమోదు కాలేదు. అయితే సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు, కిడ్నాప్ జరిగిందా లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును పోలీసులు జరుపుతున్నారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు.

