Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

Hyderabad : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

TeluguPost.com 3 days ago

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మదీనా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎస్‌వైజే కాంప్లెక్స్‌లో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు.

స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారు. ఈ ప్రమాదంలో మూడు దుకాణాల్లో మంటలు వ్యాపించాయి. అయితే ప్రమాదానికి గల కారణం మాత్రం తెలియరాలేదు.

ఎనిమిది ఫైర్ ఇంజిన్లు...దీంతో అక్కడకు అగ్నిమాపక కేంద్రానికి చెందిన ఎనిమిది ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. కానీ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు అదుపులోకి రావడం కష్టంగా మారింది. చుట్టపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అగ్నిప్రమాదం జరిగిన కాంప్లెక్స్‌లో సుమారు 100కు పైగా దుకాణాలు ఉండటంతో వ్యాపారులు బయాందోళనలకు గురవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu