Dailyhunt
Hyderabad : హరీశ్ రావు హౌస్ అరెస్ట్

Hyderabad : హరీశ్ రావు హౌస్ అరెస్ట్

TeluguPost.com 3 weeks ago

మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీశ్ రావును పరిగికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పరిగిలో ఇండ్రస్ట్రియల్ పార్కు రైతులను కలిసేందుకు నేడు బీఆర్ఎస్ నేతలు పర్యటించాలని నిర్ణయించారు.

దీంతో ఈ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు.

పరిగికి వెళ్లకుండా...

హరీశ్ రావును కోకాపేటలోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అదే సమయంలో సబితా ఇంద్రారెడ్డితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ లతో తమ ఆందోళనలు ఆపలేరని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మొహరించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu