హైదరాబాద్ లోని కూకట్‌పల్లి లూలు మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆహార పదార్థాల్లో పురుగులు, నాసిరకం నిల్వలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తున్నారు.
కిచెన్‌లో అపరిశుభ్రత, పాడైపోయిన కూరగాయలు కూడా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో కనుగొన్నారు.
గడువు ముగిసిన...ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్‌తో గడువు ముగిసిన ఫ్యాకేజ్డ్ ఫుడ్ విక్రయిస్తున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారని తెలిసింది. ఈ తనిఖీల్లో 150 కిలోల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడమే కాకుండా వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.

