ఐపీఎల్ లో ఈరోజు క్రికెట్ ఫ్యాన్స్ కు పండగ వంటిది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఢీకొంటుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
దీంతో మెట్రో రైళ్లను రాత్రి పన్నెండు గంటల వరకూ పొడిగించారు. వీలయినంత వరకూ మ్యాచ్ చూసేందుకు వచ్చే వారు మెట్రో రైళ్లలోనే ప్రయాణించాలని పోలీసులు కోరుతున్నారు.
క్రేజ్ ఎక్కువగా ఉండటంతో...హైదరాబాద్, బెంగళూరు జట్టు కావడంతో పాటు విరాట్ కోహ్లి ఆడుతుండటంతో పాటు ఇదే హైదరాబాద్ లో ఐపీఎల్ సీజన్ కు చివరి మ్యాచ్ కావడంతో భారీ సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేశారు. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం వెలుపల సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉండే అవకాశముండటంతో మెట్రో రైళ్లలో రావాలని పోలీసులు అభిమానులను కోరుతున్నారు.

