హైదరాబాద్ లో సంచలనం కలిగించిన అడ్వొకేట్ ముయిజుద్దీన్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఒక రాజకీయ పార్టీకి చెందిన నేత ఆలంఖాన్, కుమారుడు ముజాహిద్ లను అరెస్ట్ చేశారు.
భూ వివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. నిందితులు హత్య చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. వారిని పట్టుకుని హైదరాబాద్ కు తీసుకు వచ్చి విచారణ చేస్తున్నారు.
25 లక్షలు సుపారీ ఇచ్చి...హైదరాబాద్ లో న్యాయవాది ముయిజుద్దీన్ ను వాహనంతో ఢీకొట్టి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు రూ.25లక్షల నిందితులు సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు. న్యాయవాది మొయిజుద్దీన్‌ను హత్య చేసేందుకు రెండేళ్లలో పదిసార్లు ప్రయత్నించినట్టు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన భూములకు అడ్డు వస్తున్నాడని ఆలంఖాన్ సుపారీ ఇచ్చి హత్య చేయించారని పోలీసులు తెలిపారు.

